AaNaluguru



ఒక మంచి క్యారెక్టర్ ని సృష్టిస్తే  -- క్యారెక్టర్  చుట్టూ వున్న వేరే  క్యారెక్టర్ లు ...అవి చేసే పనులు ..జరిగే  సంఘటనలు  అన్నీ  మెయిన్ క్యారెక్టర్  విలువ (గ్రాఫ్) పెంచేలా  వుండాలి ..అప్పుడే  మెయిన్ క్యారెక్టర్  అందరి మనస్సులో  నిలిచిపోతుంది ....”
The elements   within the main character  really determine  the incident : How the main character reacts  to that  incident  is what  illuminates and truly defines his character .







Asset -1…
క్యారెక్టర్  కి పర్సనల్ లైఫ్  ,ప్రొఫెషనల్  లైఫ్ ,సోషల్ లైఫ్  మూడు వుంటాయి ...వాటిని బేస్ చేసుకుని  సీన్ లు అల్లుకోవాలి ....అంటే క్యారెక్టర్  ఇంట్లో ఎలా వుంటుంది ? ఆఫీసు లో ఎలా వుంటుంది ? సమాజం లో ఎలా వుంటుంది ?....అక్కడ సంఘటనలు (ఇన్సిడెంట్స్ ) జరగాలి ...అలా జరిగిన సంఘటన కి మిగిలిన క్యారెక్టర్ లు ఎలా రియాక్ట్  అవుతున్నాయి ...? మెయిన్ క్యారెక్టర్ ఎలా రియాక్ట్  అవుతుంది ?....దాని వలన క్యారెక్టర్ విలువ పెరిగిందా ..లేదా ?...అలా ప్రవర్తించినందుకు  ఇంట్లో వాళ్ళ రియాక్సన్ ఎలా వుంది ...? ఇవన్నీ ఆలో చిస్తే .కధ పూర్తి అవుతుంది ...

Incident 1: హిందూ -ముస్లిం గొడవల్లో  "మస్తాన్ భాయి " ని రఘురాం కాపాడటం ..
Incident 2:  విలవల కోసం పత్రికలూ నడపాలని -ఎడిటర్ పోస్ట్ కి రాజీనామా ..
Incident 3: కూతురు బర్త్ డే నాడు ...వెయ్యి రూపాయలు దానం చేపించడం ...
Incident 4: కూతురి ధోరణి సరిచేసి ..పెళ్లి చేయడం ..
Incident 5: కోటయ్య  -అప్పుకోసం బజారికీడుస్తుంటే - వ్యక్తి ని  రఘురాం రక్షించి ,హామీ ఇవ్వడం
Incident 6: చిన్న కొడిక్కి ఎంసెట్  ర్యాంక్  వేలలో వస్తే -డబ్బు కొని పేరుకి ఇంజనీర్  కానవసరం లేదు అనడం  .
Incident 7: పెద్ద కొడుకు లంచం కట్టి  పోలీసు అవ్వాలనుకుంటే -వద్దు ..నువ్వు అదే దారిలో వెల్తావంటాడు
Incident 8: కూతురు అల్లుడు అమెరికా కి మనీ అడిగితే  --ఇక్కడే  వుండి జాబ్ ట్రైల్ వెయ్యమంటాడు ..
Incident 9: అటెండర్ సుత్తి వేలు వచ్చి  -తన కొడుక్కి  ప్రమాదం జరిగినదన గానే   కోటయ్య  దగ్గరికెళ్ళి డబ్బు తేవడం
Incident 10: డబ్బు కోసం  కొడుకులు,కూతురు ,అల్లుడు ..చివరకు భార్య  ఇబ్బంది పెడితే ..డబ్బు తేవడం  కోసం  రఘురాం క్యారెక్టర్ ..ఇబ్బంది పడటం ..
పైన  చెప్పిన అన్ని సంఘటనలు .క్యారెక్టర్ ని అన్ని విధాలుగా  హై లైట్  చేస్తూ ...తన భావాలను ..ఆదర్శాలను  తెలియపరుస్తాడు ..అలాగే  బాధతో  రగిలిపోయి ..అందరిని సెటిల్  చేసి  చనిపోతాడు ...

ఐతే  తన ఆత్మ  ఘోష ..బాధలోంచి  మొదలవుతుంది ..తను  డబ్బు తీసుకుని  అన్యాయం చేసానని ..కానీ ..అందరు మారిపోయి ...డబ్బు ముఖ్యం కాదు .. నలుగురుకి చేసిన మంచే  ముఖ్యం ..అని కధను ముగిస్తారు ...

Asset-1:
Scenes
క్యారెక్టర్  హై లైట్ కావడం కోసం కొన్ని సీన్ లు ....డబ్బు  మీద కన్నా  మనిషి మీద వుండే ప్రేమను  చూపించడానికి  కొన్ని సీన్ లు ...డబ్బు అవసరం  పడే సీన్ లు ...దాని కోసం వేదన ,అప్పులు చేసే  సీన్ లు ...ఆత్మ ఘోష సీన్ లు ..అన్నీ  బాగా కుదిరాయి ...

Asset : 2
Screenplay
ఒక్క రోజుని స్క్రీన్ ప్లే  చేసారు ..గమనించండి ..
Starting point తెలుసు ..రఘురాం చనిపోవడం ..
Ending point తెలుసు ..రఘురాం  శవ దహనం ..
ఇవి రెండు తడితే  కధ రాయవచ్చు ...
Mid point కూడా కరెక్ట్  గా వేసారు ...

Asset -3
రాజేంద్ర ప్రసాద్ నటన
Every creative decision  must be made by choice...not necessity …
హీరో రఘురాం పాత్ర ప్రతి చోటా తనే  నిర్ణయాన్ని  తీసుకుని ..అన్నింటిలోను  ముందు వుంటాడు ..అందుకే  యాక్టివ్  గా పాత్ర  వుండటం వలన  ఎక్కడా నస అనిపించదు ...అందులో ఒక తండ్రి  కనపడతాడు .. రాజేంద్ర ప్రసాద్ పాత్రకి ప్రాణం పోసాడు ..ఆనలుగురికి ముందు ..తర్వాత  అని అతని  లైఫ్  విడదీసి చూస్తారు ..ఇక ముందు ..


Setups:
1.మూడు కుటుంబాలతో  సెటప్  లు ..ఆయా క్యారెక్టర్ లు  బాగా వచ్చాయి ..రఘురాం పెద్ద కొడుకు  కోటయ్య  కొడుకు తోనూ...చిన్న కొడుకు  సుధాకర్  కొడుకు తోనూ ...లింక్ చేయడం  వలన ..చాలా సీన్ లు వచ్చాయి ..కామెడీ  కూడా వస్తుంది ...

2. కోటయ్య క్యారెక్టర్ ..సినిమాకి ఆయువు పట్టు ..అది కాటి సీన్ లో చేసిన రాద్దాంతం ...తద్వారా  పెద్ద కొడుకు లో మార్పు ..అది లేక పోతే  సినిమా తేలిపోయేది ...అలాగే  కామెడీ కూడా అతని తో బాగా వర్కౌట్ చేసారు..

Best Song :
సీతారామశాస్త్రి  గారు రాసిన "ఒక్కడై  రావడం ..ఒక్కడై  పోవడం " సాంగ్  సినిమా మొత్తాన్ని  వినిపిస్తుంది ...ఎంత వేదాంతం ...ఎంత నిజం ఉంది... సినిమా ని సాంగ్ elivate చేసింది ....

Excellent scenes :
1.కూతురి బర్త్ డే సీన్ ...మనిషి గురించి  ఫ్లాష్ బ్యాక్ తో వివరించడం
2. ఆఫీసు లో భోజనం చేద్దామని  ఓపెన్ చేస్తే ..ఏమి వుండవు .. సీన్ లో మాటలు ..ఓపెన్ చేసినప్పుడు  ఒక లాగ ..మూసినప్పుడు  ఒకలాగా ..వినిపించడం  బాగుంటుంది ..

3.అందరికీ మనీ పంచాక "రూపాయి --రూపాయి " అనే మాటలు ..నటన ..బాగుంటాయి ..
ఇలాంటి కధ రాయాలంటే ..
 రచయతకు మనసు వుండాలి .
డైరెక్టర్  కి అనుభవం  వుండాలి ..
చివరిగా ..నిర్మాతకు  ధైర్యం  వుండాలి ...

3 comments:

Nilagiri said...

Ramesh its wonderfull analysis

Unknown said...

Awesome... suresh babu garu... manchi kadha raddamanukuntunna, alanti anveshanalo meeru tharasapaddaru.... thanks for very usefull information share chesthunnanduku... --Bhadrashiv

theguideforeveryscreenwriter said...


Thank you for nice post

Learn how to write a screenplay and make it perfect with easy to follow templates and examples. This book reveals the secrets of screenwriting from concept development, subplots, to format and beyond. No stone is left unturned which makes this the perfect tool for every screenwriter.
How to Become a screenwriter
How to write a screenplay

Post a Comment