Mantra





Mantra :
Keeping the audience on the edge of their seat is the function of SUSPENSE. Suspense is not the same as action, nor is it the same as surprise. Suspense is the ANTICIPATION of action. The longer you draw out the anticipation, the greater the suspense.

 1.The Hook. Start with a bang. Step right into a suspense scene.
(Begin with a VISUAL IMAGE  which gives  us a  strong sense  of place ,mood ,texture ,genre  and sometimes  theme.)
సినిమా ప్రారంభం అవుతూనే   మూడు హత్యలు  చూపిస్తారు ……
ఇవన్నీ  మంత్ర  నిలయం లో జరుగుతాయి ..ఎందుకు  జరుగుతున్నాయి ?...
దీని వెనక కధ ఏమిటి అన్న  సస్పెన్సు  Create  చేసాడు ...
హాల్లో కి  వచ్చిన  ప్రేక్షకుడి కి  టైం ఇవ్వకుండా  కధలోకి  లాగాలంటే  2 పద్ధతులున్నాయి ...
1. ఏదైనా  సంఘటన  తో  సినిమా స్టార్ట్ చేయాలి ..
2.పాత్ర ద్వారా కధ ని వివరిస్తూ పోవాలి ...
మొదటి పద్ధతి  బెటర్ ……రెండోది  సో ..సో ...
అందుకే మొదటి పద్దతే  ఎంచుకున్నాడు  తులసి రామ్ ..



2. The Flaw. Introduce your hero. Give him a flaw. Before you can put your hero in jeopardy we must care for him. We must want our hero to succeed. So make him human.
సినిమా ఎటువంటిది అయినా  మెయిన్ క్యారెక్టర్  తోనే  స్టార్ట్ చెయ్యాలి ...
అలాగే  చేసారు ..ముందుగా శివాజీ ని  చూపించారు ...అతని వృత్తి...ప్రవర్తన ...అన్నీ...ఒక ఇన్సిడెంట్ తో చెప్పేసారు ..
అటువంటి వాడికి  "మంత్ర (ఛార్మి )" దగ్గర  డబ్బులు వసులు చేయమన్నారు ...చేద్దామని వెళ్ళాడు ...నా నా రచ్చ  చేసాడు ...దెబ్బకు మంత్ర (ఛార్మి) ..మంత్ర నిలయానికి  తన ఫ్రెండ్ vinnee  తో  వెళ్ళింది ...
3.A required , Dynamic ,Fully developed event  that draws  us  in to the story …
అక్కడ  మంత్ర ( ఛార్మి ) ఫ్రెండ్  కి ఒక్కసారిగా  అనుకోని సంఘటన ....ఎగిరి పడుతుంది ...ఒక్కసారిగా  ప్రేక్షకుడు  స్టొరీ లోకి వస్తాడు ...
4. భయం తో  మంత్ర ( ఛార్మి ) ,తన ఫ్రెండ్  vinnee తో  కలసి ఇంటికి  వచ్చేసింది ...ఇంటికొస్తే కంప్యూటర్  లేదు ..శివాజీ ని అడిగితే తాకట్టు  పెట్టానంటాడు ... మంత్ర(ఛార్మి) --శివాజీ గొడవ పడ్డారు ...చివరికి  విషయం తెలిసింది శివాజీ కి ...--మంత్ర నిలయం లో దెయ్యాలున్నాయని ఎవరు రావడం లేదు ..ఆఖరిగా  ప్రొఫెసర్  వస్తానన్నాడు ... అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ....కధ అంతా విన్న శివాజీ  మారిపోయాడు ….నేను వుంటా నన్నాడు ..
ఫ్రెండ్స్ తో రంగం లోకి దిగాడు 
5.  Tease the audience. Make them jump at scenes that appear scary –
     but turn out to be completely normal.
ఫ్రెండ్స్  తో సరదాగా  వెళ్ళిన  వాళ్ళకి ...ఒక పిచ్చిది ..బయపెట్టడం  జరుగుతుంది ...
6.Point  of  No return :  హీరో వెనక్కి వెళ్ళలేని పరిస్థితి
ఇంతలో "మునుస్వామి " మరణం ... దాని వలన  శివాజీ  క్యారెక్టర్  ని సరదా  నుండి  సీరియస్  మూడ్ లోకి  తీసుకువెళ్తాడు ...
ముందు గా   వేసిన   హత్యల  ముడులను  ఒక్కొక్కటి  విప్పుతూ  వెళ్ళాలి ...
7.  Investigation. The hero investigates, and finds out the truth behind the every   Situation.

మొదటి ముడి  పిచ్చిది (కౌశ ) ..ఆమె కధ ...ఒక ఫ్లాష్ బ్యాక్ ..మంచి రొమాంటిక్ సాంగ్ ...దాన్ని శివాజీ డైరీ  చదివి  ఓపెన్ చేస్తాడు ..అది ఆత్మ హత్య  అని ... విషయాన్ని   శివాజీ సోదిస్తాడు.
వెంటనే  రెండవ  ముడి ...మునుస్వామి ఎందుకు చనిపోయాడు ?
8.బలం గా నాటుకుపోయే సీన్ ఒకటి వేస్తే అదే జరుగుతుందని  ప్రేక్షకుడు ఆలోచిస్తారు ..వుహిస్తారు ..
గోడమీద  "మునుస్వామి " పేరు రాస్తే  చనిపోయాడు ..అలాగే  శివాజీ కూడా  రాస్తాడు .....
“నన్ను చంపండి " అని అరచి నిద్రపోతాడు ..
లేచే సరికి ... ఫోటో ఒకటి బయట పడింది ...
 సస్పెన్సు కొనసాగింది --ఇంటర్వల్ వేసారు ..
 తర్వాత  విషయాన్ని కూడా  శివాజీ సోదిస్తాడు .. ఫోటో విషయం  వరకు వివరిస్తాడు ..
9.సినిమా కధ డల్  అవుతుంటే  కొత్త క్యారెక్టర్   ని ప్రవేశపెట్టాలి ...
(చాలా సినిమాల్లో  కామెడి  క్యారెక్టర్ లు ఇలాగె  వస్తాయి ...)
సెకండ్ హాఫ్ లో  కధ డల్ అవుతుంది  అనగా ..జీవా క్యారెక్టర్  వస్తుంది ..
కధకు అవసరం కూడా ….
10. Attacks. A couple of times during the middle of the script show some   attacks on Characters .
చిన్న చిన్న అనుకోని సంఘటనలు  జరుగుతుంటాయి ...ఎవరు చేస్తున్నారో  తెలియదు ...

11. New Direction: The story goes off in another unexpected direction.
 Hot Tip : Transcending  Genre
This means  that  you take  a familiar set of genre  expectations  and you spin the tale a slightly different way ,without  confusing  the audience  too much .

సినిమా
రాసే టప్పుడు అది   Genre  కి సంబంధించిందో  తెలుసుకోవాలి ...  ప్రకారం వెళుతూ ..మధ్యలో  వేరే Genre   కలపాలి ...అప్పుడు  ప్రేక్షకులు  థ్రిల్ అవుతారు ..
సెకండ్  హాఫ్ లో  స్టొరీ  వెళ్తున్న కొద్దీ  మంత్ర (ఛార్మి ) దెయ్యం  గా  చిత్రీకరిస్తాడు ...అప్పుడు సినిమా Horror Genre  లోకి వెళ్ళింది ,...అందరూ థ్రిల్  అయ్యారు ..
12. Showdown.  The final confrontation. The hero has to face the problem. The hero uses his brain, rather than muscles, to  clear the problem .
చివరిగా  ఇదంతా చేస్తుంది మనిషేనని ...చెప్పాడు ...
చెప్పలేనివి చివర్లో శివాజీ అన్నే చెప్పేస్తాడు ...
Main points :
సస్పెన్సు  సినిమా లో స్క్రిప్ట్  mislead  చేసే  క్యారెక్టర్ లు వుండాలి ...ఒక్కో క్యారెక్టర్  పైన అనుమానం కల్గించాలి ..తర్వాత  క్యారెక్టర్ తాలుకు  కధ ను  చూపించాలి ...అలా చేస్తూ  కధని ముందుకు తీసుకువెలుతుండాలి...చివరిగా  కధ అనుకోని మలుపు తిరగాలి...తర్వాత అసలు విషయం చెప్పేసి Climax  కి వెళ్ళాలి ...కొన్ని ముడులు మాటలతో కూడా చెప్పేయవచ్చు...
1.ఫస్ట్ పిచ్చిది ( కౌశ)  మీద ఫోకస్  చేసాడు ..అనుమానం కల్గించాడు ...ఆమె  ఫ్లాష్ బ్యాక్ ..డైరీ  ద్వారా ఒక ముడి విప్పేసాడు ..ఆత్మ హత్య  అని తేల్చాడు ..
2.మునుస్వామి మరణం ...ఫోటో ...దాన్ని వివరించాడు ..(కానీ సరిగ్గా చెప్పలేదు ..ఇదే కాస్త వీక్  పాయింట్ )
3.జీవాకి .ప్రేక్షకుడికి ..మంత్ర  దెయ్యం  అనే సీన్ లు వేసి ..దాన్ని శివాజీ ద్వారా బ్రేక్  చేసాడు ...

Asset -1
 సినిమా లైన్ గా చూస్తే  చాలా చిన్నది ... దీన్ని పూర్తి సినిమా గా చేయాలంటే  రెండు ఆయుధాలు  2 కావాలి..
Lighting is key in creating suspense. కెమెరా ..కెమెరా ..
దీన్ని  పూర్తి గా  వాడుకోవాలి ...షాక్ లు ఇవ్వాలి ..చీకట్లో బయపెడుతూ వుండాలి
సస్పెన్సు పెంచుతూ  వెళ్ళాలి ...
అంటే  ఏదో  జరుగుతుంది ...ఎవరో వున్నారు ...ఆత్మ ఉందేమో ..అని  ప్రేక్షకుడ్ని  ఆలోచింపచేస్తూ  ఇన్వోల్వ్  చేయాలి ...
సస్పెన్సు థ్రిల్లర్  లు రెండు రకాలు ..
A.Open Suspence : హత్య చేసింది  ఎవరో తెలుసు ...వాడ్ని పట్టుకోవడం ..( అనసూయ ..
B.Closed Suspence :  చంపేది ఎవరో  చివర వరకు  తెలియక పోవడం ..( మంత్ర ..అన్వేషణ )..
ఇక్కడ  జరిగిన కధ ..జరగాల్సిన కధ  అని రెండు వుంటాయి ...
ప్రేక్షకుడి  మైండ్  రెండు కధలతో  ప్రయాణం చెయ్యాలి ...
అప్పట్లో  వంశీ  తీసిన " అన్వేషణ " లో కూడా  ఇదే  ప్లే రన్ అయ్యింది ..
1.జరిగిపోయిన కధలో ఒక మిస్టరీ  వుంది ..ఒక అమ్మాయి అడవిలో చనిపోయింది ...ఎవరు చంపారు ? ఆమెను పులి చంపిందా ? మనుషులు చంపారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు  ఉదయిస్తాయి ..
2.జరుగుతున్న కధ లో  ఒకో హత్య జరుగుతూ ..భానుప్రియ అడవిలోకి వెళ్ళగానే  నాలుగురి ముసుగు మనుషుల  కాళ్ళు వెంటపడటం చూస్తాము .....వాళ్ళెవరు ? అనే ప్రశ్నలు  తలెత్తుతాయి ..ఇలా  రెండు కధలు జరుగుతూ ...ఒక్కో ముడి విడదీసి ..చివరకు  హంతకుడ్ని పట్టుకోవాలి ...

Asset -2

Songs :
ఇటువంటి సినిమా లకు పాటలు ముఖ్యం ..దాని కోసమన్నా యూత్  మళ్ళీ వస్తారు ..
ఫ్యామిలీ  లు  రారు కాబట్టి  రొమాంటిక్ పాటలు పెట్టడం అందరికి అలవాటయ్యింది ...
కౌశ సాంగ్ మరొకటి .. ఛార్మి స్కిన్ షో  సాంగ్  ఒకటి ....బాగానే వుంటాయి….
Warning :
You can have  a romantic  or dramatic subplot in almost any film. But you can notHave  a subplot  in a  horror  or thriller  ,otherwise people are either misled about  might happen or  become more interested in the sub plot  than main plot .
సినిమా లో అయినా సబ్ ప్లాట్ ప్రేమ కధ  ఉండొచ్చు ...కానీ  థ్రిల్లర్స్ ..హర్రర్స్  లో  సబ్ ప్లాట్ ప్రేమ కధ  ఉండకూడదు ..వుంటే ప్రేక్షకులు జరుగుతున్న విషయం వదిలేసి  ప్రేమకధ లో లీనం అవుతారు ...
అందుకనే  శివాజీ కి --మంత్ర  (ఛార్మి ) కి మధ్య  లవ్ స్టొరీ  పెట్టలేదు ...ఇద్దరికీ మధ్య సరదా ,చిలిపి మాటలే  వుంటాయి ...


0 comments:

Post a Comment