ScriptRule1



Script Rule 1:-
“ సినిమా  మొదలవ గానే  మొదటి  అరగంట లో మెయిన్ క్యారెక్టర్ (హీరో)  ని   ప్రేక్షకుడు  ఇష్ట పడాలి ....సానుభూతి చెందాలి ...నాదే ఆ క్యారెక్టర్  అనుకోవాలి ....చాలా సార్లు మనం అనుకున్నాం ..ఎందుకు ? “
Sympathy and Empathy:  Do we care about the principal characters?
Empathy :
Means Identification with and understanding of another's situation, feelings, and motives..
క్యారెక్టర్  నాదే  అని అనుకోవడం ..ఆ క్యారెక్టర్  పరిస్థితి ,ఫీలింగ్స్  ,ఆలోచనలు  అర్ధం చేసుకోవడం ..
దీనికి ప్రేక్షకుడు ..connect .అవుతాడు ..
Examples :
 హ్యాపీ డేస్ :
కాలేజీ  లో వుండగా  ఒకరితో స్నేహం ,ప్రేమ  అని తిరుగుతాం...నాలుగు ప్రేమ కధల్లో  ఒకదాన్ని మన జీవితాని కి పోల్చి చూసుకుంటాము .... (ఇదే  శేఖర్ కమ్ముల  టార్గెట్ )..

అపరిచితుడు :
 "నేను అన్ని రూల్స్  ఫాలో  అవుతాను ..నాలాగే అందరు వుంటే  బాగుంటుంది " అని అందరం ఒకానొక సందర్బం లో బాధ పడటం జరుగుతుంది ...అందు వలన  అది నాక్యారెక్టర్ అని అనుకుంటాము ...
బొమ్మరిల్లు :
 మన ఫాదర్  మన  ఆలోచనలకూ ,ఆశలకూ,అనుకూలంగా లేరని ఫ్రెండ్స్ దగ్గర వాపోతం...అది నా క్యారెక్టర్ అని నమ్మేస్తాం ..దానితో పాటే ప్రయాణం సాగిస్తాం ...
౩ ఇడియట్సు  :
 సినిమా లో మూడు రకాల స్టూడెంట్స్  వుంటారు ..ఏదో ఒక స్టూడెంట్ లైఫ్ మనకు మ్యాచ్ అవుతుంది ..తెలియకుండానే  మనం ఇష్టపడటం జరుగుతుంది ...
ఇలాగే---“నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ “, “ఆర్య” ,”దిల్ చాహతా హై “ కూడా మనకు  నచ్చుతాయి ...
Sympathy :
means feeling pity and sorrow for someone's misfortune....
క్యారెక్టర్ , వాడి  పరిస్థితి మీద జాలి ,సానుభూతి  కలగడం ..వాడి బాధకి  "అయ్యో " అని మనం బాధ పడేలా చెయ్యడం ... 
Examples :
ఈగ :
 నాని ప్రేమించే టప్పుడు...చనిపోయినప్పుడు ...ఈగ గా మారిన తర్వాత  -వచ్చే అడ్డంకులన్నీ ఎదుర్కొని పడిపోతున్నప్పుడల్లా  మనకి  ఆ క్యారెక్టర్  మీద సానుభూతి కలిగించాడు ...అప్పుడు వాడి బాధ , మన బాధ గా  మనసులోకి తీసుకొని  ఆ క్యారెక్టర్  గెలవాలను కుంటాం...
మర్యాద రామన్న :
సునీల్  ,తనకు ఆస్తి వస్తుందని  రాయలసీమ వెళ్తాడు ..అప్పటికే  ప్రేక్షకుడికి  కధ తెలుసు..అక్కడ  పగ తో వున్న వాళ్ళున్నారని ....అప్పుడు సునీల్ క్యారెక్టర్ మీద  సానుభూతి వస్తుంది
ఛత్రపతి :
ఈ సినిమా లో ప్రభాస్  తన తల్లి ని వెదుకుతూ వుంటాడు ...కలిసినట్టే కలసి మిస్ అవుతుంటాడు ..కలిసాక  నేనే నీ శివాజీ  ని అని చెప్పలేడు...అప్పుడు ఆ క్యారెక్టర్  మీద సానుభూతి వస్తుంది ..(ఇదే రాజ మౌళి  వెపన్ ...).
అందాల రాముడు :
సునీల్  అప్పులు తీరిపోతాయని ..తనకున్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ  ..వరంగల్  దగ్గర  పొలం  కొంటాడు ...దానివల్ల  ఇబ్బందులు పడుతుంటే  తన మీద  సానుభూతి కలుగుతుంది .

కండిషన్ :Does our sympathy stay with the protagonist, and not shift to the antagonist?
 “ముఖ్యం  గా  విలన్  మీద సానుభూతి కలగా కూడదు .”.
అది --"ఒక్కడున్నాడు " అని  గోపీచంద్ సినిమా లో జరిగింది ...అందులో విలన్ పేషెంట్ ...వాడి మీదకు హీరో  వెళ్ళడం బాగోలేదు ...

1 comments:

Unknown said...

అందాల రాముడు :
సునీల్ అప్పులు తీరిపోతాయని ..తనకున్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ ..వరంగల్ దగ్గర పొలం కొంటాడు ...దానివల్ల ఇబ్బందులు పడుతుంటే తన మీద సానుభూతి కలుగుతుంది . The above you mentioned,the movie name is pula rangadu not andhala ramudu

Post a Comment