ScriptRule2



Script Rule 2:
 మనం రాసే స్టొరీ నమ్మే విధం గా వుందా ? మనిషి కై నా  సాధ్యమవుతుందా ? అని చూసుకోవాలి ..
Believability:  Does the story rely on credible human efforts?

Examples :
ఈగ :
ఈగ ఏమిటి ? విలన్ ని చంపడం  ఏమిటి ? ఎలా చంపుతుంది ? ఇవన్ని  నమ్మలేని పాయింట్స్ ..కానీ దాన్ని నమ్మించేలా సీన్ లు ,స్క్రీన్ ప్లే  రాసుకున్నాడు..తీసాడు ..కాబట్టే  రాజ మౌళి  హిట్ కొట్టాడు ...
ఒకే ఒక్కడు :
ఒక్క రోజు  ముఖ్య మంత్రి అవ్వడం సాధ్యం కాదు...అలా అవ్వాలంటే  ఎవరికీ ఛాన్స్ వుంది ? ...టీవీ రిపోర్టర్ కి వుంది ..కాబట్టి ...కొన్ని ఆధారాలు ఉంటేనే ముఖ్య మంత్రి ని నిలదీయగలడు...ఇబ్బంది పెట్టాడు ... ఇబ్బంది లో ముఖ్య మంత్రి  నోరు జారి  ఒక్క రోజు  నా పదవి లో ఉండి చూడవయ్యా ..అని అంటాడు...హీరో సవాలు స్వీకరిస్తాడు ...ఇదంతా నమ్మే విధం గా రాసుకున్నాడు..తీసాడు కాబట్టే  శంకర్ సూపర్ హిట్  కొట్టాడు ...
జగదేక వీరుడు /అతిలోకి సుందరి :
అతిలోక సుందరి వుంటుందా ? ఎక్కడ వుంటుంది ? భూమి మీదకు ఎలా వస్తుంది ?  కారణం ఏమిటి ? భూమి మెడకు వచ్చాక  వుండిపోవాలంటే ఏం జరగాలి ? ఇవన్ని  నమ్మించేలా  లైటింగ్ ,కొన్ని సీన్ లు వుంటాయి...కాబట్టే నమ్మాము...రాఘవేంద్ర రావు  గారికి  పెద్ద హిట్ లభించింది ...
టాగోర్ :
ఒక మనిషి  ఒక దగ్గరే  ఉండి ...మొత్తం అవినీతి  చేసే వాళ్ళని కిడ్నాప్ చెయ్యగలడా ?
 ఎలా చేస్తాడు ? ఒక్కడు  ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుని  అవినీతి ని మట్టు పెట్టాలని పూనుకున్నాడు ?  ఇవన్నీ  సాధ్యమేనా ?....అదే  సాధ్యం అని  సీన్ లు ,ఫ్లాష్ బ్యాక్  కరెక్ట్  గా కుదిరేలా వున్నాయి  కాబట్టి ...హిట్ అయ్యింది ...

నువ్వొస్తానంటే నేనోద్దంట్టానా :
 ఒక ఫారిన్  లేత  యువకుడు  ప్రేమ కోసం ..దుక్కి దున్ని...నారు పోసి..నీరు పెట్టి...పంట చేతికి  వచ్చేలా చేసుకోగలడా? కుదరదు ...కానీ  కుదిరింది ...అదే నమ్మించడం అంటే ....
అపరిచితుడు :
రామం ,అపరిచితుడు ,రేమో గా మారడం ..మారి శిక్ష వేయడం ..ప్రేమించడం ..అన్నీ  నమ్మే విధం గా  సీన్ లు వుంటాయి ... పది మంది కొట్టి పడేస్తే ..లేచి  వచ్చి విరోగ్గోడతాడు....ప్రతి దానికి కారణం వుంటుంది ... దానికి తగ్గ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది ...అలా నమ్మించేలా  చేసాడు శంకర్ ....

బొమ్మరిల్లు :
సినిమా పాయింట్ చూడడానికి  చాలా చిన్నది  ...కాని సీన్ లు జాగర్త గా  వుండాలి ...లేదంటే   ఫాదర్ చేసేది  కరెక్ట్  అని ప్రేక్షకుడు  సినిమా ని తిప్పి కొడతాడు ...అందుకే  చాలా జాగర్త గా  సీన్ లు అల్లు కున్నాడు భాస్కర్ ...అందుకే హిట్ అయ్యాడు ...
ఆర్య :
ఇలాంటి  క్యారెక్టర్  వుంటే  ప్రేమికులు ( అజయ్ ,గీత ) ఎలా స్పందిస్తారు ? ముఖ్యం గా  గీత ఫ్రెండ్స్  ఎలా  రియాక్ట్  అవుతారు ..? రియాక్సన్  కి ఆర్య  ఎలా సమాధాన మిస్తాడు ? వాళ్ళ నోర్లు  మూయిన్చినట్టే  ..మన నూర్లు మూయించాడు కాబట్టే  సుకుమార్ గెలిచాడు ...
Creative clue :
సినిమా అంటేనే  అసాధ్యాన్ని --సుసాధ్యం  చేయడం ...అందుకే సినిమా ఎలాంటిది  రాస్తున్నా నమ్మించడం ముఖ్యం ...
ఒకటే గుర్తు పెట్టుకోండి ...బయట కుదరదు ..అనుకున్నది ...సినిమా లో కుదురుతుంది ...  ఐడియా  రాగానే ..దాన్ని ఎలా  నమ్మించేలా చెయ్యాలి ? ఎలా క్యారెక్టర్ ,సీన్ లు ,మాటలు ...ఉండాలో చూసుకోవాలి అంతే ...



go for it .

0 comments:

Post a Comment