ScriptRule5



Script Rule  5:
సమస్య  హీరో  దగ్గరికి రాకూడదు ...హీరోనే  సమస్య దగ్గరకి  వెళ్ళాలి ...
( హీరోయిన్ Oriented film  అయినా  సరే )
ఒక్కడు :
హైదరాబాద్  లో కబడ్డీ ఆడుకునే వాడు  అజయ్ ( మహేష్ బాబు ) ని  కర్నూల్  ఎందుకు తీసుకెళ్ళారు ? ఎందుకంటే  సమస్య  అక్కడ  వుంది కాబట్టి ...
అక్కడ  ఓబుల్ రెడ్డి ( ప్రకాష్ రాజ్ ) ని డీ  కొట్టాలి కాబట్టి ...
రోజా :
ఎక్కడో సిటీ లో వున్నా అరవింద్ స్వామి  కాశ్మీర్   వెళ్ళాల్సి  వచ్చింది ...ఎందుకంటే అక్కడే  అసలు కధ ...దానికి లింక్ అయిన సమస్య వున్నాయి కాబట్టి ....
అరుంధతి :
 సిటీ లో వుండే  అరుంధతి ( రెండవ అనుష్క ) గద్వాల్  సంస్థానానికి  వెళ్ళింది ..అక్కడే  పశుపతి ఆత్మ  వుంది ..సమస్య అక్కడే వుంది ...కాబట్టి అలా  హీరోయిన్ వెళ్ళాలి ..
శివ :
గోడవలుయ్ జరుగుతున్న  కాలేజీ  లోకి శివ (నాగార్జున ) అడుగుపెట్టాడు ..సమస్యలకు  కేంద్ర బిందువు  కాలేజీ ...అందుకే అక్కడకి  వెళ్ళాడు.
మర్యాద రామన్న :
 సునీల్ పొలం  అమ్మడం కోసం రాయలసీమ  వెళ్తాడు ...అసలు కధ  అక్కడే కదా  జరగాల్సింది ...అక్కడకు వెళ్లి పగతో వున్న విలన్ ఇంట్లో పడ్డాడు ..సమస్య అక్కడ .. ఇంట్లో వుంది కాబట్టి  అక్కడకు వెళ్ళాల్సిందే ...
బిజినెస్ మాన్ :
 హీరో ముంబై  వస్తాడు ...ఎందుకు ?...ముంబై నుండే ఆట మొదలు పెట్టాలి కాబట్టి ...అక్కడే అన్ని సమస్యలు వున్నాయి ...అన్నింటినీ సాల్వు  చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ...అక్క్కడకు రావాల్సిందే ...
పూల రంగడు :
సునీల్ ఒక పొలాన్ని  వరంగల్  లో కొంటాడు ..అక్కడకి  వెళితే   ఇద్దరి విలన్ మద్య వుంటుంది స్థలం ...అదే మరి సమస్య దగ్గరికి  హీరో వెళ్ళడం అంటే ...
మంత్ర :
శివాజీ మంత్ర (ఛార్మి ) ఇంటికి  వచ్చి గొడవచేస్తాడు ..తర్వాత  శివాజీ మారిపోయి మంత్ర నిలయం కి వెళ్తాడు ...ఇక్కడ శివాజీ సమస్య వున్న స్థలానికి  వెళ్ళాడు ...
పందెం కోడి :
హీరో విశాల  కాలేజీ అయ్యాక  ఫ్రెండ్  వూరు  వెళ్తాడు ..అక్కడే విల్లన్ వున్నాడు ... అక్కడ విలన్ ని కొడతాడు ..అక్కడే సమస్య వుంది ...అక్కడికే  వెళ్ళాడు హీరో ...
విక్రమార్కుడు :
చం బల్ లోయలో సమస్య వుంది ..అక్కడికే  హీరో రవితేజ వెళ్ళాలి ...ఆట ఆడిస్తాడు ..
అపరిచితుడు :
 మూడు హత్యలు  జరిగే ముందు  ప్రతి సమస్య  దగ్గరకు  వెళ్లి  హీరో రామం  సాధారణం గా పోరాడతాడు ..చేసేది లేక హత్య లు చేస్తాడు  అపరిచితుడు గా ....
నువ్వొస్తానంటే  నేనొద్దంటాన :
హీరో సిద్ధార్థ  తన ప్రేమ ని  గెలిపించుకోవడానికి  శ్రీహరి వున్న పల్లె టూరి కి
వస్తాడు ...అసలైన  సమస్య  అక్కడే వుంది ...( ఫస్ట్ హాఫ్ లో హీరో కేమీ సమస్యలు లేవు ..వున్న అవి చిన్నవి )...
Condition :
అయితే  ఇది అన్ని సినిమాలకు  వర్తించదు ...ఆక్షన్  సినిమాలకు వర్తిస్తుంది ...కధలో  హీరో నేపధ్యం  వేరు ....విలన్ నేపధ్యం వేరు  అయితే ...ఇది బాగా వర్కౌట్  అవుతుంది ...
రూల్  కి   opposite సినిమా "యముడు "...
హీరో దగ్గరకు విలన్ ప్రకాష్ రాజ్ రావడం ..తర్వాత    సూర్య transfer    కావడం ....
ప్రకాష్ రాజ్  వుండే  వైజాగ్  కి రావడం ...ఆట మొదలవ్వడం ...
అందుకే కొంచెం ఆలోచించాలి ..

0 comments:

Post a Comment