Arrya


“అ”   |   “ ఆ”
(“అ”జయ్  | “ ఆ”ర్య  మధ్యలో   గీత )






"ఒక సహజ విరుద్ధ మైన పాత్ర  ,ప్రేక్షక మనస్సులోకి ఎక్కించాలంటే ..అది ఒప్పించే విధంగా  వాదించాలి ..నమ్మించాలి ..అప్పుడే ఆ పాత్ర  హిట్ అవుతుంది ."

ఆర్య:-
ఒక సహజ విరుద్ధమైన  పాత్ర ...ఇటువంటి  వాడు ఉండడు..ఒక వేల వుంటే  ఎలా వాదిస్తాడు ?
ఎలా తన ప్రేమను తెలియ చేస్తాడు ?ఎవరైన   ప్రశ్నిస్తే  ఎలా సమాధానం చెబుతాడు ? ప్రేమించిన అమ్మాయి  మనసులో వేరోకరున్నా  ,వీడు ఎలా  అ స్థానాన్ని  ఆక్రమించాడు ? అందుకే ఈ సినిమా  కొత్తగా  వుంది .
ఇది క్యారెక్టర్ మీద ఆధారపడిన స్టొరీ..
నువ్వు తాజ్ మహల్  ని ఇష్టపడ్డావు ..నేనూ ఇష్ట పడ్డాను ...నీను డ్రాప్ అవ్వను..నీది లవ్ అయితే నాది ఫీల్ మై లవ్ అంటాడు.
గట్టిగా మొదటి ప్రేమికుడు  నిలదీస్తే "ఎం  నమ్మకం లేదా ?" అంటాడు .....ఈ పాయింట్  సినిమా లో అందరికి నచ్చింది .. ఆర్గుమెంట్  తో కదా ని ఇంటర్వల్ వరకు నడుపుతారు ...ఆ తర్వాత  ఆర్య  వాళ్ళ ప్రేమకోసం  చేసే  ప్రయాణం లో అతని  క్యారెక్టర్  రేంజ్  పెంచి ...ఒక్క పాట లో అమ్మాయి మనసు కరిగి పోయేలా చేసారు

  •  నిజం చెప్పాలంటే  ఇంటర్వల్ బ్లాక్  అదురుతుంది .
  • ఇంకో నిజం ఏమిటంటే ...మొదటి ప్రేమికుడు -అజయ్  గీత  ని పెళ్లిచేసుకుంటానంటే తన తండ్రి ఎం పి అవతారం ఒప్పుకుంటాడు ...సినిమా అక్కడి తో అయిపోతుంది ..కానీ అప్పుడే కథ కొత్త మలుపు తిరుగుతుంది.
  • "నిజమైన ప్రేమ అంటే  ఇవ్వడం ...తీసుకోవడం కాదు."అని తెలియచేస్తుంది ..
  • ప్రేమలో  వున్న ఒక అమ్మాయిని --వేరొక అబ్బాయి వచ్చి  అసలైన ప్రేమ కు అర్ధంచెప్పి ప్రేమ  లో   పడేయడం .ఇది సినిమా స్టొరీ
  • ఇందులో  -ఒక అమ్మాయి గీత  -
    అజయ్ తో బలవంతం గా ప్రేమ లో పడట ..10%
    ఆర్య వచ్చి  అసలైన  ప్రేమ ను చూపుతూ  ముందుకు సాగడం ..తద్వారా
    అమ్మాయి  గీత  ప్రేమలో  పడటం ..90%



Asset 1:-

 కొత్తదనం  ...కొత్తదనం....
టైటిల్స్ వేయడం దగ్గరం నుండి ..బాబ్బ్ల్లు కామెడీ  ట్రాక్ ...పిల్లలతో అల్లరి ...సరదాగా సాగే కాలేజీ ఎపిసోడ్లు ...నీట్ట్ గ వుండే  ఫ్రేములు ...వినదగిన సంగీతం ...అన్ని కలసి వచ్చే అంశాలే ....

Asset 2:-

 కొత్తసీన్లు......


  • ఆర్య  గీత కి  రాసిన  ప్రేమ లేఖ  తో  --గీత  ఫ్రెండ్స్  అందరు ఆర్య ని ప్రశ్నలువేస్తారు.. ఆర్య  సమాధానాలు  ఇస్తాడు.  ఆ సీన్
  • ఆర్య  "నమ్మకం లేదా " అని సాగే  డ్రైవ్ ..  ఆ సీన్


  • బాబ్బ్లు  తో మూడు రాళ్ల తో చేసే కామెడీ ట్రాక్ .....   ఆ సీన్
  • ఆర్య -గీత  కి ఇచ్చే బర్త్ డే  గిఫ్ట్   ఆ సీన్
  • ఆర్య  - గీత  తో క్యారెక్టర్  మర్చుకుందాం --అనే  ఆ సీన్
  • ఆర్య  -- చీమ  తో  గీత  గురించి చెప్పడం   ఆ సీన్


Asset 3:-
సాంగ్స్...............
హీరో (ఆర్య ) సోలో గా వుండే సాంగ్స్ ఎక్కువ ..కానీ 4 పాటల్లో  హీరొయిన్ ఉండేలా జాగర్త పడ్డారు ..
హీరో ..హీరోయిన్ ..కలిసేది  ఒక్క పాటలోనే ..అది  కూడా మాన్తేజ్  సాంగ్ కాబట్టి ఫీల్  వస్తుంది ...

Creative Clue:-

"Darr "సినిమా  చుడండి ..రివర్స్  చేస్తే ఆర్య  కథ ..జుహీ చావ్లా ,సన్నీ డియోల్  బార్య భర్తలు ..వాళ్ళ మధ్య  షారుఖ్ ఖాన్  వస్తాడు ...నెగటివ్ క్యారెక్టర్  ..కాబట్టి చనిపోతాడు ....ఆర్య  పాజిటివ్  క్యారెక్టర్  కాబట్టి  ప్రేమని గెలుచు కుంటాడు .
                                      ఇలా ఆలోచించడం  కూడా  ఒక ఆర్ట్ ...

0 comments:

Post a Comment