Nuvvu naku nachav




Plot and subplot  Intersect each other



Plot :



 ఇద్దరు ప్రాణ మిత్రులు ..ప్రకాష్ రాజ్ ..చంద్రమోహన్ ..
"ఇద్దరి మధ్య  స్నేహం  మాత్రం తేడా రాకూడదు .." అని చంద్రమోహన్ -తన కొడుకు వెంకటేష్  కి చెప్పడమే    సినిమా కి మెయిన్ త్రెడ్.....


SubPlot :


నిశ్చయ తాంబూలాలు  --అయిపోయిన  నందిని ( ఆర్తి అగర్వాల్ ) ...వెంకటేష్ తో ప్రేమలో పడటం ... మలుపులు .. వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అన్నది ముఖ్య కధ…..
ప్లాట్ ..సబ్ ప్లాట్  బాగా కలసి పోయి  కధ ..కధనం ..కామెడీ ..అన్నీ  ఫ్యామిలీ ఎంటర్టైనర్  గా  మారింది…

Asset -1

త్రివిక్రమ్ రాసిన  మాటలు ..క్యారెక్టర్ లు  వాటి ద్వారా  జరిగే  మాటల కామెడీ ..సీన్ కామెడీ ...అంతా చాలా బాగుంటుంది ... అందుకే నంది అవార్డు  వచ్చింది ....
Best scenes:

1.వెంకటేష్ గురించి  చంద్రమోహన్ లెటర్  రాయడం ..అది ఆర్తి ,పింకి  చదువుతూ  వెంకటేష్ గురించి చెప్పడం ..

2.వెంకటేష్ భోజనాల దగ్గర  ప్రార్ధన .. తర్వాత ప్రకాష్ రాజ్ కవిత ...

3.బ్రహ్మానందం వచ్చిన  బ్లాక్ ..




 4.ఆషా షైనీ పెళ్లి కొడుకు ( ప్రుద్వీరాజ్)  తో వెంకటేష్  మందు కొడుతూ చెప్పే  మాటలు ...

ఇలా
వివరించడం కష్టం గానీ ...అంతా  ఒక నవ్వుల ప్రవాహమే ………………….


Asset-2

హీరో  వెంకి క్యారెక్టర్  ..అతని ప్రవర్తన ...అందరి యంగ్ స్టర్స్ ని Identify  చేసుకునేలా వుంటుంది ...కళ్ళ ముందే నిశ్చితార్దం  జరిగిన అమ్మాయి  తనని  ప్రేమించింది ... తర్వాత  తను ప్రేమించాడు ..కానీ  ఎక్కడ హద్దు మీరడు ...చాలా బాలన్స్ గా  క్యారెక్టర్  చేయాలి ...తన బాధ ఎవరికీ చెప్పలేడు..అందుకే  మందు తాగి ...మనకు చెప్పాడు ... చివరకుప్రేమించాననే విషయం ప్రేమికురాలికి కూడా  చెప్పలేదు... కావాలంటే  సినిమా ఒక సారి చూడండి…

Asset-3
సాంగ్స్  ..
ఫస్ట్ సాంగ్  ఆకాశం దిగి వచ్చి”...డాన్సు  బాగా కంపోస్ చేసారు ..
అందుకే నంది అవార్డు  వచ్చింది ....( సుచిత్ర చంద్రబోసు )
4 Situation songs ..2 dream songs  ... బాగుంటాయి ...
సీతారామ శాస్త్రి గారి  కలం నుండి జారిన –“ఒక్కసారి చెప్పలేవా ..." లో వెంకటేష్ క్యారెక్టర్ ...అతని ప్రేమ ..అంతా చెప్పడం బాగుంది ...

Breaking the rules :
ఇందులో  చాలా  రూల్స్  బ్రేక్  చేసారు ...
1.ఇంటర్వల్ కి హీరోయిన్  లవ్ లో పడింది ...అసలు ఫస్ట్ హాఫ్ లో హీరో లవ్ లో పడడు....అంటే క్యారెక్టర్  ప్రకారం  ఆలోచిస్తే  రూల్స్ బ్రేక్ చేయవచ్చు అన్నమాట ...
2.హీరో కధను నడపడు..పరిస్తితులకు అనుగుణం గా వెళ్తూ వుంటాడు ..హీరో  ఎక్కడా కధలో మలుపులు create చెయ్యడు....
3.ఎంత బాధ  వున్నా  Active   గా వుంటాడు ...అదే Dimensionality ..పలు రకాల భావాలను హీరో వ్యక్తం చేయడం ..కామెడీ గా ఉంటూనే  సీరియస్  అవుతూ ..మళ్ళీ  కామెడీ లోకి వస్తూవుంటాడు ....అదే క్యారెక్టర్ ని తీర్చి దిద్దిన విధానం ... Hats off  to  త్రివిక్రమ్…..
4. వెంకటేష్  ఆర్తి ని చూస్తూ ..సూర్యకాంతం  కళ్ళు  గీస్తాడు ..అప్పుడు  ఆర్తి  అందాన్ని  చూస్తాడు ...అందుకే " నీ కళ్ళు నాకు నచ్చలేదు ..నచ్చలేదు " అని పాట పడుకుంటాడు ..లవ్ లో పడతాడు ..అంతటి బలమైన  సన్నివేసం లేకపోతె  వెంకటేష్ ప్రేమలో పడటాన్ని ఒప్పుకోరు ...(Excellent scene )
5.Setup :

ఆషా షైనీ  ని క్యారెక్టర్  ని బర్త్ డే పార్టీ కి ...ఆ తరువాత  ఆ అమ్మాయి పెళ్లి  కుదిరిందని  హీరో హీరొయిన్  పింకి వెళ్ళడం ...అలా వాటర్ వరల్డ్  బ్లాక్ ...మంచి సెటప్ ...




Main points :
1.కధ..కధనం ..మాటలు ..వీటిల్లో  ఒక్కటి కొత్త గా  వుంటే చాలు  సినిమా హిట్ అవుతుంది ..అయితే  సినిమాలో  కధనం ..మాటలు  కొత్త గా వుండటం  వలన  సూపర్ హిట్ అయ్యింది

2.Never Describe the romance …only describe the events  that lead to romantic encounters .
ప్రేమను వివరించకూడదు ..ఒక సంఘటన ద్వారా ప్రేమను తెలియపరచాలి ..
(ఈ పని సరిగా  చేయలేకపోవడం వలన  "ఆరెంజ్ " ఫ్లాప్  అయ్యింది ..)
3.హీరో కి  Inner conflict..  మరియు  ..External conflict  వుండాలి ..




“నాన్న స్నేహం దెబ్బతినకూడదుInner conflict .... అయితే ...
“నిశ్చితార్ధం  అయిన  అమ్మాయిని  ప్రేమించకూడదు  ...ప్రేమించినా  చెప్పకూడదు “...అనేది External conflict ….
Inner conflict  --ఎవరికీ చెప్పలేనిది… ఇది పైకి కనపడదు ..
External conflict --చెప్పగలడు ..కానీ అనర్ధాలు జరుగుతాయి .. ఇది  పైకి  కనిపిస్తుంది..
 Inner conflict బలం గా వుండి ...External conflict  మీద  ప్రభావం చూపాలి ...
అప్పుడే  టెన్షన్ Buildup   అవుతుంది ...సినిమా బాగుంటుంది ..
ఇదే  బొమ్మరిల్లు లో  చూస్తాం ..


1.We want well matched pair ..they are fall in love ..it connects  to audience ..
ప్రేమించుకునే వాళ్ళు ఒకరికొకరు  మంచి  జంట గా వుండాలి ..వాళ్ళు  ప్రేమలో పడాలి ...అప్పుడే లవ్ స్టొరీ ప్రేక్షకులకు  లింక్ అవుతుంది ...


2.the best part of love story  is the almost  the obstacles ..the thrill of getting closer ….ప్రేమకధల్లో    ప్రేమికులకు  అడ్డంకులు  ముఖ్యం.. వాళ్ళు ఎలా కలుస్తారన్నది ముఖ్యం..

3.Give your women  some depth .

అమ్మాయిల గురించి కాస్త  లోతుగా ఆలోచించేలా ..చర్చించాలి ...
(అదే సుహాసిని క్యారెక్టర్  చేస్తుంది ..అందుకే నంది అవార్డు  వచ్చింది ..)

0 comments:

Post a Comment