vikramarkudu




 హిందీ అమితాబ్  "డాన్" +  న్యూ స్క్రీన్ ప్లే +  న్యూ బ్యాక్ డ్రాప్ = విక్రమార్కుడు...

Basic Rules :
1.ఒక సినిమా లో ఇద్దరూ  ఒకే పోలికతో  ఉంటే ..క్యారెక్టర్  కాంట్రాస్ట్  కోసం ఒకడు కూల్ గా వుంటే  ఇంకొకడు  ఫాస్ట్ గా వుండాలి ...ఒకడు సరదాగా వుండే దొంగ  ఐతే ...ఇంకొకడు సీరియస్ గా వుండే పోలీసు వాడు గా వుండాలి ..అప్పుడే బాగుంటుంది ..(.ఇదే రూల్  "రాముడు -భీముడు ...రౌడీ అల్లుడు ....హలో బ్రదర్ అదుర్స్  లో మనం గమనిస్తాం )
2.ఒక క్యారెక్టర్  చనిపోతే  ...వేరే  క్యారెక్టర్ ప్లేస్  లోకి వెళ్ళాల్సి వస్తే ..మంచి  కారణం  తో  ..మంచి సీన్ తో  తీసుకుని  వెళ్ళాలి ...సీరియస్  గా వున్నా క్యారెక్టర్  చనిపోతుంది ...అతడి అవసరం  ఒక ప్రాంతానికో  ,కుటుంబానికో ,ఒక వర్గానికో  వుంటుంది ...అలా సెకండ్ క్యారెక్టర్  ప్లేస్ లోకి వెళ్ళే లా  పరిస్తితులు  కల్పించాలి ...వాడ్ని ప్రవేశ పెట్టాలి ...
Story :
మెయిన్ హీరో  దొంగ రవితేజ  కాబట్టి ...అతని లైఫ్  ఎక్కువ గా చూపించాడు  రాజ మౌళి ..విక్రంరాతో డ్ ఎవరు ? అని ఫస్ట్ హాఫ్ లో సస్పెన్సు  బిల్డ్  చేసాడు ... విక్రంరాతో డ్ కి సంబంధించిన  మనుషులు  దొంగ రవితేజ ని ట్రాప్ చేయడానికి  అతని దారిలోనే వస్తారు ...రైల్వే స్టేషన్ లో పెద్ద పెట్టి కొట్టేసి సెటిల్ అవుదామనుకున్న రవి తేజ కి అందులో పాప వుండటం ,.... పాప దొంగ రవితేజ ని నాన్న అనడం ...దొంగ రవితేజ  పాపను కాదనుకున్నా ..జాలి పడి దగ్గరకు తీసుకోవడం తో 1st half  కధ కొలిక్కి వస్తుంది ...అసలు విషయం తెలుస్తుంది ...పోలీసు రవితేజ  ఒకడు ఉన్నాడని....అతని  గురించి ఫ్లాష్ బ్యాక్ ... 



అతని వీరత్వం ...చంబల్ లోయలో  అతని కి వున్న ప్రజల మద్దత్తు ..అతని మంచి పనులు ...అన్నీ  చూపిస్తారు ...కాని టిట్లా వలన  ఒక బుల్లెట్ కి బలి అయ్యాడు ...అని అందరు అనుకుంటారు ...కాని  బ్రతికే వున్నాడు ...తన లాంటి వాడి కోసం చూసాడు ... రౌడీ రవితేజ దొరికాడు… ఇక రౌడీ రవితేజ   ప్లేస్ లోకి వెళ్లి  విలన్ లందరినీ  చెడుగుడు  ఆడతాడు ....మాములు కధే ....
Asset -1:
1.పిల్లలంటే ఇష్టం లేని రవితేజ కు పాప మీద ప్రేమ  కలగడం ...ఫస్ట్ హాఫ్  కి వున్న త్రెడ్..
2. ఇంటర్వల్ ముందు వచ్చే Fight   సీన్  చాలా బాగుంటుంది ...

3.ఫ్లాష్ బ్యాక్ లో  పోలీసు రవితేజ వచ్చే ముందు  విలన్ లు చేసే ఆగడాలను చూడలేము ..అంత ఘోరం గా పరిస్థితులు వుంటాయి .. టైం లో  పోలీసు రవితేజ రాకతో ...అతని సీరియస్ నెస్ తో మనం చాలా హ్యాపీ గా  ఫీల్ అవుతాం. ...కానీ చనిపోతాడు  అని తెలియగానే బాధ పడతాం...అదే సానుభూతి పాయింట్  ప్లే చేసాడు రాజమౌళి ...
4. రౌడీ రవితేజ  కామెడీ గా గుండ్లు చేసే సీన్ చాల చాలా బాగుంటుంది ...


5.రవితేజ ,బ్రహ్మానందం  లు పెట్టె కొట్టేసాక కామెడీ బాగుంటుది ...

6. ముఖ్యం గా  రవితేజ మానరిజం  "జింత తా చితా చితా జింతా తా ..." అని చేతులతో చెప్పే విధానం బాగుంటుది ...చిన్న పిల్లలు కుడా హమ్ చేసారు ....

నిజం చెప్పాలంటే ..పరమ రొటీన్  సినిమా నే...కానీ  కొత్త బ్యాక్ డ్రాప్ ...కొత్త మానరిజం ...రవితేజ మార్క్ కామెడీ ..సీరియస్ నెస్  ఇవన్నీ కాస్మెటిక్స్  గా పనిచేస్తాయి ...
కాబట్టే  హిందీ లో "రౌడీ రాథోర్ " కనక వర్షం కురిపించింది ...

Creative Clue :

హిందీ అమితాబ్ "డాన్" లో మొదటి గా "డాన్" నుండి కధ స్టార్ట్ చేసారు ... డాన్  చనిపోతే  ..అటువంటి వాడి కోసం ఒక పోలీసు ఆఫీసర్  తిరిగి ...పాన్ వేసుకొనే అమితాబ్ ని తెస్తారు ...అమితాబ్ దగ్గర  ఇద్దరు పిల్లలు వుంటారు ..అదే సినిమా ని ..మంచి స్క్రీన్ ప్లే తో ...కొత్త బ్యాక్ డ్రాప్ ...తో  రాజ మౌళి తాయారు చేసాడు ..అదీ Creativity  నే  కదా...

0 comments:

Post a Comment