ScriptRule4



Script Rule 4 :
హీరో పాత్ర యాక్టివ్ (Active )  గా వుండాలి ..పాసివ్ (Passive ) గా వుండ కూడదు ..అంటే  హీరో పాత్ర  కధని నడపాలి ....కధే  పాత్ర ని నడిపితే  అది పాసివ్  పాత్ర అవుతుంది ..
అతడు
సినిమా లో మహేష్ పాత్ర చేయని  మర్డర్  లో ఇరుక్కుంటుంది ..కానీ చిన్న అవకాశం దొరుకుతుంది ...రాజీవ్ కనకాల  అన్నీ చెప్పి చనిపోవడం ..అంతే  మహేష్ ..పారదు లాగా  మారిపోతాడు .. పాత్ర లోకి వెళ్లి ..వాళ్ళ ఇంటి సమస్యలు (పొలం, పెళ్లి , పుజరిగారికి డబ్బు ఇవ్వడం )..అన్నీ  తనే ముందు వుండి  తీరుస్తాడు ...యాక్టివ్ గా వుండటం వలన హీరో గ్రాఫ్ పెరుగుతుంది ..
ఆర్య :
తన లవ్ చెప్పిన దగ్గరినుండి ..ఆర్య క్యారెక్టర్ తనే ముందు వుండి ..ఇంటర్వల్  వరకు కధను నడుపుతాడు ..మళ్ళీ  తన ప్రేమ మొదటికి వస్తుంది ..ఇంటర్వల్ తరువాత కూడా ..గీత కి అన్నే సమస్యల్లో  ముందు వుండి హెల్ప్ చేస్తాడు ..హీరో నే  కధను  నడుపుతాడు ..
ఈగ :
నాని ఈగ గా మారిన తరువాత  ..అంతా ఈగే కధను నడుపుతుంది ..విలన్ ని ఇబ్బంది పెట్టడం ..బిందు తో చెప్పడం ..అన్నీ తనే ముందు వుండి చేస్తుంది...చివరకు చావులో కూడా ...

 ఒక్కడు :
మహేష్  కర్నూల్  వెళ్ళిన దగ్గరనుండి ..భూమిక ను కాపాడి ..చివరవరకు ..తనే  కధను  నడుపుతాడు ..(విలన్ ఇచ్చే   లు పట్టించుకోకండి )..హీరో ఎదురుతిరుగుతున్నాడా ..లేదా ? అదే  ముఖ్యం ..
ఒకే ఒక్కడు :
మాట జారిన  ముఖ్యమంత్రి తో  సవాలు కి సిద్దం అంటాడు..అన్నీ  సవాళ్ళు అధిక మించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ..
మంత్ర :
శివాజీ క్యారెక్టర్  మొదట వచ్చి  ఛార్మి  ఇంట్లో తిష్ట వేస్తాడు ..తర్వాత  మారి పోయి  "మంత్ర " నిలయం లో ఏమి జరిగిందో ..తనే  సోదిస్తాడు .. సాధిస్తాడు…
హ్యాపీ డేస్ :
చందు  పాయింట్ ఆఫ్ వ్యూ  లో సాగే  కధనం లో  చందు ..మిగిలిన క్యారెక్టర్ లు కధను  ముందుకు నడుపుతాయి ..నాలుగు పాత్రలలో  మూడు పాత్ర లు  లీడ్  తీసుకుంటాయి ...అందుకే  కధ లో గొడవలు ..అలకలు వస్తాయి ...
చంద్రముఖి :
రజనీకాంత్  పాత్ర  కీలకమైన  సన్నివేశాల లో   గా మరి కధను  ముందుకు నడిపిస్తుంది ..చివరకు  రహస్యాన్ని  బయటపెట్టేది ..కధకు  మలుపులు  తెచ్చేది  రజనీకాంత్ మాత్రమే...

హీరో  అవసరం లేకపోయినా  ముందు వుండాలి ..అంతే కానీ  ఎదైనా  సంఘటన  జరుగుతుంటే  చూస్తూ  కూర్చోకూడదు ...ఎవరైనా  బాధ పడుతుంటే  ఒదర్చాలి...ప్రశ్నించాలి..నిలదీయాలి ...ఫైట్ చేయాలి ..పాటలు పాడాలి...అదే  Active  character  అంటే ...

1 comments:

Post a Comment